జనసే ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
1 min read
నివాళులర్పించిన జనసేన నేత రెడ్డి అప్పల నాయుడు
పేద బడుగు బలహీన వర్గాల వారికి చీరలు,దుప్పట్లు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : బెజవాడ బెబ్బులిగా పేరుగాంచిన, పేద,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ప్రజా హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీ వద్ద కాపు–బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ ప్రాదేశిక మండల చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పల నాయుడు, వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 50 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సాహసమే ఊపిరిగా,తిరుగుబాటే తత్వంగా, దుర్మార్గశాసనాల వ్యతిరేక పోరాటమే జీవిత ధ్యేయంగా రంగన్న జీవించారు. ఆయన పేరును వినగానే బడుగు ప్రజలు చేతులు జోడించి వందనాలు చేస్తారు. అదే గౌరవం, అదే స్ఫూర్తి ఆయన ప్రజా జీవితం పట్ల. ఆయన స్థాయికి రాలేకు పోయినా, ఆయన ఆశయాల బాటలో మనమందరం నడవాలి,’’ అని అన్నారు. వంగవీటి రంగా ఎంతో ముందే తన జీవితాన్ని పేదల కోసం అర్పించాల్సి వస్తుందని తెలిసినా, వెనుకడుగు వేయకుండా పోరాటం చేసిన త్యాగశీలి అని గుర్తుచేశారు. ‘‘1988 డిసెంబరు 26న నిరాహార దీక్ష చేస్తే ప్రాణం పోతుందన్న విషయం ముందే తెలిసినా, వెనక్కి తగ్గలేదు. తన జీవితాన్ని బలిగొన్నాడు. అదే స్థిరత, అదే ప్రజాప్రేమ, అదే త్యాగం అని అన్నారు. ‘రంగన్న విగ్రహాలు కేవలం కృష్ణా లేదా గుంటూరులోనే కాదు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ప్రతి ఊరిలో ఉండే స్థాయిలో ప్రజల మనస్సుల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం ప్రజలు ఆయన జయంతి, వర్ధంతులను స్మరించుకుంటుండటం ఒక ఉదాత్త గౌరవ సూచిక అన్నారు. రెడ్డి అప్పల నాయుడు అభిప్రాయపడుతూ నేడు బడుగు, మధ్య తరగతి వర్గాలపై అన్యాయం జరుగుతున్నప్పుడు రంగన్న ఆశయాల బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదల సమస్యల పట్ల మనం అహర్నిశలు పోరాడాలి. జనసేన ఆ లక్ష్యాలే అనుసరిస్తోంది. రంగా త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన బాటలోనే పయనిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు నాగం శివ, కాపు–బలిజ సంక్షేమ సేన ఏలూరు అసెంబ్లీ సమన్వయకర్త కంది రంగబాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు సుధా బత్తుల శ్రీదేవి, కాపు నాయకులు గరికిపాటి సూర్యప్రకాశ్, యడ్లపల్లి ప్రసాద్, బోండా రాము నాయుడు, కొప్పిశెట్టి వేణుగోపాల్, అరవింద్, రోహిత్, భీసంశెట్టి నాగేశ్వరరావు, సుధా బత్తుల హరీష్ నాయుడు, రాజేష్ నాయుడు, వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నాయకులు రెడ్డి గౌరి శంకర్, వీరంకి పండు, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కూనిశెట్టి మురళి, బుద్ధా నాగేశ్వరరావు, కొండేటి రమేష్, మల్లెమొగ్గల బాలాజీ, అచ్యుత నాని, పుప్పాల శివరామయ్య, తోట కిషోర్, మొదవ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
