NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అల్ట్రాటెక్ సంస్ధ వైద్య పరికరాలు వితరణ చేయడం అభినందనీయం

1 min read

జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి

నంద్యాల,న్యూస్ ​నేడు: అల్ట్రాటెక్ సిమెంటు సంస్ధ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పలు రకాల వైద్య పరికరాలను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లో అల్ట్రాటెక్ సంస్ధ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సుమారు రూ. 12 లక్షల విలువైన  వైద్య పరికరాలను కలెక్టర్ సమక్షంలో సర్వజన ఆసుపత్రి వైద్యాధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. అల్ట్రాటెక్ సంస్ధ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను అందజేయడం సంతోషకరమన్నారు.  ఇందులో ఒక ఈసిజి మెషిన్, 2 డెఫ్రిబిలేటర్స్, 1 సక్షన్ అప్పారేటస్, 2 వైన్ ఫైండర్స్ అందజేయడం జరిగిందన్నారు. ఈ వైద్య పరికరాల ద్వారా జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగ్గా సేవలు అందజేసే అవకాశం ఏర్పడిందన్నారు. అల్ట్రాటెక్ సంస్థ వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.అంతకుముందు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ అల్ట్రాటెక్ సంస్ధ ప్రతినిధులకు వివరించారు.కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి, యూనిట్ హెడ్ సాజేంద్ర కుమార్, సిఎస్ఆర్ అడ్మిన్ అంజన్ ప్రకాష్, సిఎస్ఆర్ హెడ్ సురేష్, సిఎస్ఆర్ మేనేజర్ గోపాల్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.ప్రసన్నకుమార్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author