టీజీ వెంకటేష్ జన్మదినం సందర్భంగా వేద ఆశీర్వచనం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నాడు మాజీ రాజ్యసభ సభ్యులు అపర దాన కర్ణుడు శ్రీ టీజీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా వారి గృహంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం వారు వేద పండితులతో సహా వెళ్లి దంపతి సమేతంగా శ్రీ టీజీ వెంకటేష్ కి వేద ఆశీర్వచనం చేయడం జరిగింది వారు కలకాలం మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయంగా అధికారంలో ఉంటూ మంచి పదవులను పొంది పేద ప్రజలకు సహాయ సహా కారాలు అందించాలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం తో కూడిన శాలువాను కప్పి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేద ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌరవాధ్యక్షుడు చెరువు వెంకట దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షుడు కంచు గంటల శ్యామసుందర్రావు, ప్రధాన కార్యదర్శి చల్ల నాగరాజు శర్మ, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, గౌరవ సలహాదారులు సముద్రాల శ్రీధర్ టివి రవిచంద్ర శర్మ వేద పండితులు అర్చక పురోహితులు శ్రీ కె మహేష్ శర్మ శ్రీ ప్రసన్నకుమార్ శర్మ మామిళ్ళపల్లి రాజేష్ శర్మ, గురు రాజా చార్, పరమేశ్వరరావు తదితర పురోహితులంతా కూడా పాల్గొనడం జరిగింది అని అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ తెలియజేశారు.