10న వేళాంగణి మాత తిరుణాల మహోత్సవం..
1 min read
ముఖ్య అతిథిగా రానున్న కడప బిషప్..
భారీగా తరలిరానున్న విశ్వాసులు
ఏర్పాట్లు చేస్తున్న విచారణ గురువు కేడీ జోసఫ్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రహదారిలో ఉన్న వే ళాంగని మాత చర్చి దగ్గర ప్రతి ఏడాది అత్యద్భుతంగా మే 10వ తేదీన జరగనున్న తిరునాళ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏప్రిల్ 9న కడప నూతన బిషప్ గా బాధ్యతలు చేపట్టిన మహా..శ్రీ శ్రీశ్రీ సగినాల ప్రకాష్ తండ్రి రానున్నారని 10వ తేదీ సా 6 గంటలకు బిషప్ ఊరేగింపు అనంతరం దేవాలయ ఆవరణంలో పీఠాధిపతులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారని విచారణ గురువులు ఫాదర్ కేడి జోసఫ్ అన్నారు.దూర ప్రాంతాల నుండి తమ మొక్కుబడులు చెల్లించుకునేందుకు గాను వేల సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు.వీటిని దృష్టిలో పెట్టుకొని విచారణ గురువు ప్రజలకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటవ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజూ సా 6 గంటలకు వివిధ విచారణల గురువులతో ప్రజలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.నిన్న ఫాదర్ సిద్ది పోగుల దేవదాస్ జెండాను ప్రతిష్టించారు.ఈరోజు ఫాదర్ సెల్వరాజ్,3వ తేదీ ఎం ప్రవీణ్, 4న ప్రేమగిరి ఫాదర్ రాజశేఖర్, 5న బిషప్ హౌస్ సెక్రటరీ ఫాదర్ ఈ ప్రవీణ్,6న ఫాదర్ తరుణ్,7న మనోజ్,8 న కోయిలకుంట్ల ఫాదర్ గాబ్రియే ల్,9న అనంతపురం ఫాదర్ మనోహర్ లు పూజలు సమర్పిస్తున్నారని ఫాదర్ కేడీ జోసఫ్ అన్నారు.పదవ తేదీన జరిగే మహోత్సవ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వచ్చి దేవుని ఆశీస్సులు పొందాలని విచారణ గురువు అన్నారు.
