పెట్రోల్ బంక్ ఓపెనింగ్ లో పాల్గొన్న విజయసాగర్ రెడ్డి
1 min read
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లె మండలకేంద్రంలో సాయిబాబా గుడి దగ్గర గాలివీటి వీరనాగిరెడ్డి ,గాలివీటి వివేక్ రెడ్డి లకు చెందిన పెట్రోల్ బంక్ ను రాజంపేట నియోజకవర్గ వైసీపీ నేత గాలివీటి విజయసాగర్ రెడ్డి(మదన్ రెడ్డి) వీరనాగిరెడ్డి, వివేక్ లతో కలిసి ప్రారంభించారు.వీరబల్లె లోనే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ప్రజలకు నిరంతరం ఇంధన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.కార్యక్రమంలో వీరబల్లె మండల మాజీ అధ్యక్షులు గాలివీటి విజయభాస్కర్ రెడ్డి, పెద్దివీడు సర్పంచ్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు .
