NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్” కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: యూత్ పార్లమెంటులో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలతోపాటు రాజ్యాంగానికి సంబంధించిన విషయాలపట్ల యువతకు అవగాన కలుగుతుందని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ఆఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖతోపాటు, రాయలసీమ యూనివర్సిటీ ఎన్​ఎస్​ఎస్​  విభాగం మరియు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కాలేజీల సంయుక్త నిర్వహణలో జరిగే “వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్” కార్యక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పోస్టర్ను వైసాఛాన్స్లర్ విడుదలచేశారు. “వికసిత భారతంకోసం ఒకేదేశం ఒకే ఎన్నికలు” అనే అంశంమీద జరిగే ఈ యూత్ పార్లమెంట్లో పాల్గొనడానికి 18 నుండి 25 సంవత్సరాలలోపు వయసుగల యువతీయువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న యువత https: //mybharath.gov.in అనే వెబ్సైటులో ఈ నెల 16 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఇదే అంశానికి సంబంధించి 1 నిమిషానికి తక్కువకాకుండా విడియోను తెలుగు, హిందీ లేదా ఇంగ్లీషులో రూపొందించి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలలతోపాటు విద్యార్థినీ విద్యార్థులకు తెలపడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాస్థాయిలో జరిగే ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయికి, అక్కడినుండి జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కర్నూలు నంద్యాల జిల్లాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు ఆచార్య బసవరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడుతో పాటు వర్సిటీ ఎన్​ఎస్​ఎస్​   ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *