NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ బాలగణపతి సేవాసమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  విజయవాడ గుణదల ఏఎస్ రామారావు రోడ్  గంగిరెద్దుల దెబ్బ  సమీపంలో  శ్రీ బాలగణపతి సేవాసమితి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి,  ఈ సందర్భంగా శ్రీ బాల గణపతి సేవా సమితి కమిటీ సభ్యులు  దేవరకొండ సాయి మహేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమాలు సంప్రదాయపద్ధంగా  అర్చకులు  నవ్వులూరి సాయిబాబు దీక్షితుల ఆధ్వర్యంలో జరిగాయని, పూజా కార్యక్రమ అనంతరం ప్రసాద వితరణ జరిపారు,   కుంకుమ పూజ లలితా సహస్రనామాలు  భక్తి శ్రద్ధలతో మహిళలు పెద్ద ఎత్తున ప్రతిరోజు ఒక కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి  విఘ్నేశ్వరుడి విగ్రహ దాత డాక్టర్ కిరణ్ కుమార్ కు  కమిటీ తరఫున  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిరికి బత్తిన రాజేష్, దాసరి లక్ష్మణరావు, దేవరకొండ సాయి మహేష్, రాఘవేంద్ర, రాచమల్ల వినోద్, కళాకు భరత్, కలా పు గోపి, చంద్రశేఖర్, లోకేష్ మనోహర్, రవికుమార్  తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానికులకు, ముఖ్యంగా మున్సిపల్ మరియు పోలీసు అధికారులకు, ఉచిత కరెంటు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వానికి  కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

About Author