వివేకా హత్య కేసు.. చార్జిషీట్ దాఖలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తంగా నలుగురు నిందితులపై చార్జ్ షీట్ దాఖలైంది. హత్యకేసులో నిందితులుగా ఉన్న టి. గంగిరెడ్డి, వై. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలపై సీబీఐ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. హత్య కేసులో నిన్న సీబీఐ ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేసింది. పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. సునీల్ యాదవ్ ను అరెస్టు చేసి 90 రోజులు పూర్తీ కావడంతో నిన్న ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈరోజు పూర్తీ స్థాయి చార్జ్ షీట్ దాఖలు చేశారు.