స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలి
1 min read
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్
ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణకు ఎంతో కృషి చేస్తుంది
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: గ్రామ స్థాయి బాలల వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్ పిలుపు గురువారం ఉదయం 11 గంటలకు ఏలూరు ఎంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ (క్రాప్) సంస్థ ఆధ్వర్యంలో కె హెరాల్డ్ బాబు అధ్యక్షతన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈసందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కొరకు ఎంతో కృషి చేస్తుందని జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న బాలల సంక్షేమ మరియు రక్షణ సమన్వయ కమిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు సీడబ్ల్యూసీ ఇన్చార్జి ఛైర్మన్ పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సేవా సంస్థలు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కార్యదర్శి నేతల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు సేవా సంస్థలు సమన్వయంతో కలిసి పని చెస్తేనే మెరుగైన ఫలితాలు కనపడతాయని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సేవా సంస్థలతో సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే శివకృష్ణ యం నికోల సేవా రాజారావు సీహెచ్ ప్రభాకర్ రావు యస్ రవిబాబు ఆర్ వినోద్ కుమార్ యు బాలస్వామి టీ సంధ్యానాని జి విజయ భాస్కర్ పీవీ రమణ ఆర్ ప్రసాద్ కే వరకుమార్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.