ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం ఓటు
1 min read– ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
13 వ జాతీయ ఓటర్ దినోత్సవం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం ఓటుహక్కు అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. బుదవారం మున్సిపాలిటీ లో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని మండల అధికారులు, మున్సిపల్ అధికారుల చే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారన్నారు. ఓటు హక్కుపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తు కొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారని తెలిపారు. అర్హత కలిగిన ఓటర్లు, బాధ్యతగల భారత పౌరులుగా ఓటు హక్కను స్వచ్ఛందంగా వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటర్ గా పేరు నమోదు చేసుకోవడం, ఆపై ఓటు వినియోగించుకోవడంపై ప్రతిఒక్కరికి అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ, ఉర్డు అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ హాజీ అబ్దుల్ షూకురు,మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్, తహశీల్దార్ రాజశేఖర్ బాబు, మండల వ్యవసాయ అధికారిణి శ్రావణి, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ ఆర్ ఓ విజయలక్ష్మి, డీఈ నాయబ్ రసూల్, ఏఈ భాను ప్రతాప్, ఐసీడీస్ సూపర్ వైజర్ నజ్మా, అనురాధ, హంద్రీనీవా ఏఈ సాంబశివుడు, మున్సిపల్ పారిశుద్ధ్య అధికారి సునీత, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య, బ్రహ్మణకొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డి, అర్బన్ సిఐ విజయ భాస్కర్,వైసీపీ పట్టణ మహిళా నాయకురాలు డా.వనజ, వైసీపీ నాయకులు పేరుమాళ్ళ జాన్, బిజినేముల మహేష్, మాజీ కౌన్సిలరు దేశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.