హామీలు ఇచ్చాం.. నెరవేరుస్తున్నాం…
1 min read
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..
1,53,183 రూ.ల చెక్కుల పంపిణీ
వీపనగండ్ల,తిమ్మాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే జయసూర్య..
పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు): ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. “సుపరిపాలనలో తొలి అడుగు”అనే కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేస్తూ నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ముందుకు వెళ్తూ ఉన్నారు.సోమవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్లలో ఉదయం మొహరం పండుగ సందర్భంగా గ్రామంలో వెలసిన పీర్లను ఎమ్మెల్యే దర్శించుకున్నారు.తిమ్మాపురంలో సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటిస్తూ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం నుండి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు.
వృద్ధులను పలకరిస్తూ సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే
గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వృద్ధులనూ మహిళలనూ ప్రజలను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరిస్తూ వారు సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల మండల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
బోద కాళ్లు ఉన్నప్పటికీ నాకు పెన్షన్ మంజూరు కావడం లేదని వీపనగండ్లకు చెందిన గద్దల సామన్న ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. అదేవిధంగా మహిళ తనకు ఎవరూ దిక్కు లేరని చెప్పడంతో ఆ మహిళకు పంచాయతీలో ఇంటి స్థలము మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి 1,53,183 రూపాయల చెక్కును ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.చెరుకుచెర్ల గ్రామానికి చెందిన కాతా జయమ్మకు 87,183 రూ.లు మరియు పేరెడ్డి విజయలక్ష్మికి 70 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.దీంతో ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు తెలుపాలని సమస్యలను పరిష్కరించేందుకు నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా కల్పించారు.అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఎంపీడీఓ పి. దశరథ రామయ్య,ఎస్ఐ హెచ్ ఓబులేష్,మనోహర్ రెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి,చాకర్ వలి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
