9 న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
1 min read

కార్మిక సంఘాలకు ప్రజలకు పిలుపు సి.ఐ.టి.యు.
ప్యాపిలి, న్యూస్ నేడు: దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు లేబర్ కోడ్ గా చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ. చిన్న రహిమాన్, భవన నిర్మాణం కార్మిక సంఘం కార్యదర్శి లక్ష్మణ్, ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు ఎస్. ఇలియాజ్, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు రంగస్వామి, నెట్టుకల్, కార్మికులకు ప్రజలకు పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షులు. పి.రామాంజినేయులు అధ్యక్షత వహించగా ఎస్.ఏ. చిన్న రహిమాన్ మాట్లడుతూ 11సంవత్సరాల మోడీ ప్రభుత్వం హయంలో పెట్టుబడి దారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తు కార్మికులను నయా బానిసలుగా చెసే విధానాలను అనుసరిస్తున్నారని అందులో భాగంగానే బ్రిటీష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదింపు చేయడానికి త్రివంగా వ్యతిరేకిస్తున్నామని, అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని, దేశంలో లక్షలాది మంది కార్మికుకూలుగా పని చేస్తున్నా వారికి కనీస వేతనాలు నేటివరకు అమలుకు నోచుకోవడం లేదని,కార్మికులందరికీ కనిసావేతనాలను అమలు చేయాలని,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, దేశంలో పెద్ద ఎత్తున పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజువారికులు వేదనాలను 600 రూపాయలు ఇవ్వాలని, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, ఇలియాజ్, రవి, నాగేంద్ర, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

