NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవాడలో అంగన్వాడీల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

1 min read

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి: సిఐటియు డిమాండ్

డోన్​ న్యూస్​ నేడు: విజయవాడలో శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం కోసం అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు మరియు ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీలను ఈరోజు తెల్లవారుజామున నిద్రపోతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు గా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరెస్టు చేసిన అంగన్వాడీలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.మాణిక్యంశెట్టి,టి.శివరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం దగ్గర సిఐటియు పట్టణ అధ్యక్షులు మాణిక్యం శెట్టి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు.యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు బి.వై.సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్,జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జి.రామమూర్తి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలకు అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించారు.సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు నక్కి శ్రీకాంత్, మండల కో కన్వీనర్ బి.నాగమద్దయ్య,సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్.ఎ.చిన్న రెహమాన్,యూటీఎఫ్ ప్యాపిలి మండల నాయకులు రాజేంద్ర,డోన్ నాయకులు శ్రీనివాసరెడ్డి,అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సులోచనమ్మ,సుమలతరహమద్ బి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి,మాధవి,సువర్ణ,అరుణ,కుల్లాయమ్మ,ఆలియా,మాసుంబి నాగలక్ష్మి,పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *