వ్యవసాయ చట్టాలు వెనక్కి తెస్తాం !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మళ్లీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారాయన. కొందరి వల్లే చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయని, కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామని, ఒక అడుగు ముందుకు వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారాయన.