NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సకాలంలో పి4 సర్వే పూర్తి చేస్తాం..

1 min read

వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ కె.విజయానంద్ కి వివరించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

పల్లెవెలుగు , నంద్యాల: జిల్లాలో పి4 సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణనిచ్చి మార్గదర్శకాలు జారీ చేశామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. గురువారం ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, పి4 సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లు, సంబంధిత ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, డిఆర్ఓ రామునాయక్, సిపిఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పి4 సర్వేపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సంపూర్ణ శిక్షణనిచ్చి పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. అన్ని గ్రామాల్లో గురువారం నుండి పి4 సర్వే ప్రారంభమైందని కలెక్టర్ వివరించారు. ఈ సర్వేలో మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను భాగస్వామ్యం చేసి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి రెండో తేదీలోగా పి4 సర్వే పూర్తి చేసి సేకరించిన సర్వే వివరాలపై సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించుకుని నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ నివేదించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పరీక్షల ప్రశ్నాపత్రం మూమెంట్ ను పోలీసులు తనిఖీలు చేసేలా చర్యలు తీసుకోవాలని డివిఈఓ సునీతను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో సిసిటివి కెమెరాలు  ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జవహర్ బాబును కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఏ పిడి శ్రీధర్ రెడ్డి, జడ్పి డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డి, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *