ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం
1 min read– అధికార పార్టీ తొత్తులు శ్రీ నవనంది, జీవన్ జ్యోతి, స్కాలర్ యాజమాన్యం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : మార్చి 13న జరగబోయేటటువంటి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది ,స్కాలర్స్, జీవన్ జ్యోతి స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని ఏఐఎస్ ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగ నాయుడు,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక నందికొట్కూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వారు విలేకరులతో ఆయన మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు యజమాన్యాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలిసింది మరచి సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలు చేస్తూ ఓటర్లను పక్కదారి పట్టించేందుకు తాయిలాలు ఎర చూపుతున్నారని ఆరోపించారు. కనీసం ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను గెలిపించేందుకు ఓటర్ కు రూ. 5000 డబ్బులు పంపిణీ చేశారని మా దృష్టికి రావడం జరిగిందన్నారు. దీనిపైన ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విచారణ జరిపి వారి పైన కఠిన చర్యలు తీసుకుని వాటి స్కూల్ గుర్తింపు లను రద్దు చేయాలని డిమాండ్ చేయాలని లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.