ప్రజాధనాన్ని దోచిన ప్రతి ఒక్కరి నుంచి ఆఖరి రూపాయిసహా రికవరీ చేస్తాం
1 min read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
దెందులూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నాం
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: “కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిన ప్రతీ ఒక్కరు నుంచి ఆఖరి రూపాయి సహా రికవరీ చేస్తామన్నారు. దెందులూరు నియోజకవర్గ మొత్తం మీద ఎక్కడైనా వీళ్ళు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అని లేదా, వీళ్ల మనుషులు వైసిపి జెండా మోసారు అనే వివక్షతో అయినా ఏ ఒక్క తల్లి కైనా వాళ్ళ బిడ్డ కైనా తల్లికి వందనం ఇవ్వకుండా మేము ఆపామని నిరూపించగలరా? వివక్ష లేని పాలనే మా విధానం. మీకు అసలు నీతి, నిజాయితి గురించి మాట్లాడే కనీస అర్హత ఇంకా ఉందా? వైసిపి నాయకులను ఉద్దేశించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలు వ్యాఖ్యలుచేశారు.ఏడాది సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నాం – దోచుకోవటమే లక్ష్యంగా గత వైసిపి నాయకులు పాలన చేసి దెందులూరు నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేశారు – పైగా కనీసం ఆత్మసాక్షి అనేది కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కాలనీల నిర్మాణాల పేరుతో దోచింది ఎన్ని కోట్ల రూపాయలో లెక్కలు తేల్చటానికి బహిరంగ చర్చకు సిద్ధమా?ఇళ్ళల్లో మీటింగ్ లు పెట్టుకుని రెచ్చి పోవడం కాదు. సిద్ధం అంటే బహిరంగం గానే చర్చిద్దాం – అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోపిడి చేసిన ప్రతి ఒక్కరి నుంచి ప్రజా ధనాన్ని తిరిగి రికవరీ చేసి కట్టిస్తాం. మీలాగా ప్రజలను వేధించే కక్ష సాధింపు పరిపాలన కూటమి ప్రభుత్వం చేయదు. దెందులూరు నియోజకవర్గం మొత్తంమీద వైసీపీ కార్యకర్తలు గాని, నాయకుల పిల్లలకు గానీ లేదా వైసిపి జెండా మోసారనే వివక్షతో ఏ ఒక్క తల్లి కైనా, బిడ్డకైనా తల్లికి వందనం ఇవ్వలేదని నిరూపించగలరా? అని ప్రశ్నిస్తున్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి చేశారు. పెదవేగి లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదవేగి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పనులను,అదేవిధంగా వివిధ శాఖల పనితీరును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు పలు శాఖలకు చెందిన అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
