వరద బాధితులను ఆదుకుంటాం.. :ఎమ్మెల్సీ రామచంద్రయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, రాజంపేట: జవాద్ తుఫాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య. బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలైన తొగురుపేట, మందపల్లి, పులపత్తురు, ఎగువ మందపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా పలు గ్రామాలకు నీరు ప్రవహించి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇక్కడి పరిస్థితులను చూసి చలించిన ఆయన సొంత నిధులతో ప్రతి కుటుంబానికి బియ్యం, చీరలు, బకెట్లు, మగ్గులు, టవల్స్, బెడ్ షీట్లు, లుంగీలు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు రావడం సహజమన్నారు. విపత్తుల కారణంగా పలు గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరిందని వ్యక్తం చేశారు. పంటలు నీటమునిగాయని, పశువులు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసి బాధితులకు బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన వల్ల వరద బాధితులకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని , బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యుత్త, వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు వంటివి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5800 వితరణ అందించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా నష్టపోయిన బాధితులకు నష్టపోయిన గ్రామాలకు స్పెషల్ ఫండ్స్ కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను అన్ని గ్రామ ప్రజలను సి.రామచంద్రయ్య తెలియజేశారు. కార్యక్రమంలో నైనర్ శ్రీనివాసులు, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్. భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు రాంప్రసాద్ రెడ్డి, నారాయణ, వైకాపా నాయకులు సతీష్ రెడ్డి, శీను, బాబు, గోపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, మనీ, ఆకుల ప్రసాద్ బాబు, చంద్రశేఖర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.