విదేశాల్లో వెల్డింగ్ ఉద్యోగ అవకాశాలు- అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృది సంస్థ(APSSDC), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(OMCAP) మరియు నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) సంయుక్తంగా రాయలసీమ ప్రాంతం లోని నిరుద్యోగ యువతకోసం, ఇతరదేశాల్లో వెల్డింగ్ మరియు నిర్మాణరంగం నందు ఉద్యోగ అవకాశాలు మీద అవగాహన సదస్సు ను 12.02.2026(గురువారం) రోజున పులివెందుల లోని నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) నందు వెల్డింగ్ మరియు నిర్మాణరంగం నందు విదేశాల్లో శిక్షణ ఇచ్చే సాఫ్కో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మరియు అసెస్మెంట్ వారి ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి 10వ తరగతి/ఐటీఐ/డిప్లొమా/ఇంజనీరింగ్ చదివి 19 సం|| నుండి 45 సం|| వయస్సు గల అభ్యర్థులు హాజరు అయ్యి సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు.ఇతర వివరాలకు నాక్ బిల్డింగ్, పులివెందుల నందు లేదా 9000517637, 9701271158 ను సంప్రదించగలరు.

