NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్  స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలి

1 min read

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, రక్షణ విషయం లో జాగ్రత్తగా ఉండాలి

నిర్లక్ష్యం వహిస్తే  కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు,  న్యూస్​ నేడు  :జిల్లాలో  సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లాలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్  స్కూళ్లలో హాస్టల్స్ నిర్వహణపై సంక్షేమ శాఖల అధికారులు,డిఇఓ, రెసిడెన్షియల్ స్కూళ్ల కో ఆర్డినేటర్లు, కేజీబీవి ల స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్ల లో విద్యార్థులు వసతుల లేమి తో ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. హాస్టళ్ల లోపల, బయట పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నారు. టాయిలెట్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో  టాయిలెట్స్ మరమ్మతులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో సీఎస్సార్ నిధులు లేదా డీఎంఎఫ్ నిధులతో చేయిస్తామని, బీసీ, ఎస్సీ హాస్టళ్లలో టాయిలెట్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు.. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తగిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్ కు సంబంధించి వర్కర్స్ అవసరం ఉంటే, తగిన ప్రతిపాదనలు పంపాలన్నారు.హాస్టళ్లలో పాములు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, మెష్ లు ఏర్పాటు చేయాలని, పిచ్చి చెట్లు, ముళ్ళ పొదలు లేకుండ చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బిసి సంక్షేమ శాఖ అధికారి ప్రసూన, డిఇఓ శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

About Author