వెట్ ల్యాండ్ లను గుర్తించి నివేదిక అందచేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో గుర్తించిన వెట్ ల్యాండ్ లపై నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్ ల్యాండ్ రూల్స్,2017 ప్రకారం జిల్లాలో వెట్ ల్యాండ్ సంరక్షణ, నిర్వహణ కోసం జిల్లా వెట్ ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.నీరు నిలువ ఉండే ప్రాంతాలు సహజ మైన లేదా కృత్రిమ,శాశ్వత మైన లేదా తాత్కాలిక, స్థిరమైన లేదా ప్రవహించే, తాజా, సముద్ర నీటి ప్రాంతాలతో సహా, తక్కువ అలల తో లోతు ఆరు మీటర్లు గల నీటి సముదాయాలను వెట్ ల్యాండ్ కింద పరిగణించబడుతుందని తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వెట్ ల్యాండ్ వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.. జిల్లాలో 333 వెట్ ల్యాండ్స్ ఉన్నట్లు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అట్లాస్ గుర్తించిందని, ఆ మేరకు భూముల సరిహద్దులతో పాటు గ్రౌండ్ ట్రూతింగ్ తదితర వివరాలతో వారం లోపు నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ రెవెన్యూ మరియు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, డి.ఎఫ్.ఓ శ్యామల, ఇరిగేషన్ ఎస్ ఈ ద్వారకనాథ్ రెడ్డి,ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ నాగేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ,జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, కర్నూలు అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ,పొల్యూషన్ కంట్రోల్ ఈఈ కిషోర్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి విజయ తదితరులు పాల్గొన్నారు.ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.