PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఎఫ్‌’ క్లబ్ లో ఏం జ‌రిగింది.. ఈడీ ఉచ్చులోకి ఎఫ్ క్లబ్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. ప్రముఖ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ను విచారించిన ఈడీ .. ఇప్పుడు ఎఫ్ క్లబ్ పై దృష్టి పెట్టింది. ఎఫ్ క్లబ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎఫ్ లాంజ్ ప‌బ్ మేనేజ‌ర్ ను ఈడీ విచారించింది. 2015, 17 సంవ‌త్సరాల మ‌ధ్య కాలంలో ఎఫ్ క్లబ్ లో పెద్దఎత్తున పార్టీలు జ‌రిగాయ‌ని, ఆ పార్టీల‌కు ప‌లువురు సినీప్రముఖులు హాజ‌ర‌య్యార‌ని గుర్తించారు. పార్టీల‌కు ముందు, త‌ర్వాత పెద్ద ఎత్తున క్లబ్ అకౌంట్లలోకి నిధులు వ‌చ్చాయ‌ని , కొంత మంది న‌టీన‌టులు పెద్ద ఎత్తున క్లబ్ మేనేజ‌ర్ అకౌంట్ కి డ‌బ్బు బ‌దిలీ చేశార‌ని స‌మాచారం. ఎఫ్ క్లబ్ వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు ఈడీ సేక‌రించింది. కెల్విన్, జిషాన్ లు క‌లిపి ఈ వ్యవ‌హారం న‌డిపిన‌ట్టు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. కెల్విన్, జిషాన్ ల అకౌంట్ల నుంచి విదేశాల‌కు పెద్ద ఎత్తున నిధులు బ‌దిలీ అయిన‌ట్టు గుర్తించార‌ని తెలుస్తోంది.

About Author