అమరావతి పునర్నిర్మాణం సరే ..రాయలసీమ డిక్లరేషన్ ఏమైంది
1 min read
దేశ ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమపై తమ వైఖరిని స్పష్టం చేయాలి.
కర్నూలు డెవలప్మెంట్ ఫోరం, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరశన.
కర్నూలు , న్యూస్ నేడు: నేడు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో రాయలసీమపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కర్నూలు డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ మోహన్ కడింపల్లి, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ డిమాండ్స్ తెలుపుతూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మోహన్ కడింపల్లి, రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు గతంలో రాయలసీమకు ఇచ్చిన రాయలసీమ డిక్లరేషన్,మిషన్ రాయలసీమ సంగతి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు 1953లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలును పాలకులు విస్మరించి ఏపీ అంటే ఏఅంటే అమరావతి,పిఅంటే పోలవరం అని చెబుతున్నారని మరి మొదటి రాజధాని, కృష్ణ,తుంగభద్ర నది జలాలను త్యాగం చేసిన రాయలసీమ గతేమిటో చెప్పాలని, రాయలసీమ కరువు,వలసలు,రైతుల ఆత్మహత్యకు కారణమెవరో చెప్పాలని అమరావతి జపం చేస్తూ రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించడం అన్యాయమని అన్నారు.రాయలసీమలో శ్రీబాగ్ ఒప్పందం అమలు ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని, రాయలసీమకు పన్ను మినహాయింపును ఇవ్వాలని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు ఇచ్చిన హామీలనన్నిటిని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ రాయలసీమ ఉద్యమకారులు సత్యనారాయణ గుప్తా,రైతు స్వరాజ్య వేదిక సభ్యులు శేఖర్ పోతుల,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పాలకొమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు.