PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధ‌ర ఎంతంటే !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా జ‌న‌వ‌రి 7న థియేట‌ర్ల‌కు రానుంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు డీవీవీ. దాన‌య్య నిర్మాత‌. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా న‌టించారు. సినిమా పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రోవైపు ఏపీ, తెలంగాణ‌లో సినిమా టికెట్ ధ‌ర‌ల పై చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా.. ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని సూచించింది. ఈ నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధ‌ర‌ల పై తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌’కు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.175, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్‌ ధర ఉంటుంది. అన్ని థియేటర్లు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని మేం ఇప్పటికే చెప్పాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే ఆ థియేటర్‌ని సీల్‌ చేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది’’ అని ఏషియ‌న్ సునీల్ వివరించారు.

                                        

About Author