ఆయన రుణదాహం ఎప్పటికి తీరుతుందో ?
1 min read
పల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల కోసమే ఢిల్లీలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిష్టవేశారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణదాహం ఎప్పటికి తీరుతుందోనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు మొదలయ్యాయని, ఏపీ ప్రభుత్వానికి ముందు చూపు కన్నా మందు చూపే ఎక్కువైందని ఎద్దేవా చేశారు. కృష్ణపట్నంలో లోకల్ కోల్‌ను వాడుకోవచ్చు కదా అని సూచించారు. ప్రభుత్వానికి అప్పులపైనే ఆలోచన తప్ప.. ఒక విజన్ అంటూ ఏమీ లేదని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.