NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోదీజీ… మాతో గొడ‌వెందుకు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఢిల్లీలో ఇంటింటికి రేష‌న్ అందించాల‌న్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాద‌న‌ను తిర‌స్కరించ‌డం పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆమోదం కోసం ఎలాంటి ప్రతిపాద‌న పంప‌క‌పోయినా.. తిర‌స్కరించిన‌ట్టు లేఖ రాయ‌డం హాస్యాస్పద‌మ‌ని అన్నారు. రేష‌న్ పంపిణీ విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వాల‌కు పూర్తీ హ‌క్కు ఉంద‌ని అన్నారు. త‌మ‌తో ఎప్పుడూ గొడ‌వ‌ప‌డే మూడ్ లో ఎందుకు ఉంటారో అడ‌గ‌ద‌లిచిన‌ట్టు ఆయ‌న చెప్పారు. 75 ఏళ్లలో ఇంత‌లా గొడ‌వ‌పెట్టుకునే ప్రధానిని ఎప్పుడూ చూడ‌లేద‌ని మ‌నీష్ సిసోడియా అన్నారు. ప్రధాని రాష్ట్రాల‌తో గొడ‌వ‌లు మానుకోవాల‌ని ప్రజ‌లు కోరుకుంటున్నార‌ని మ‌నీష్ సిసోడియా అన్నారు.

About Author