PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పక్కా ప్రణాళికతో…నడిరోడ్డుపై కి ఈడ్చారు..!

1 min read

కట్టుకున్న భార్యని,కన్నతల్లిని చెప్పుకోలేని విధంగా చిత్రహింసలతో బలవంతంగా

నడిరోడ్డుపైకి లాగారు.. బాధిత దంపతుల ఆవేదన
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: కుటుంబ యజమాని లేని సమయంలో కట్టుకున్న భార్యని.పసి పిల్లలను కన్నతల్లిని చిత్రహింసల గురి చేస్తూ మురుదుడ్డి రాజు అతని అనుచరులు నడిరోడ్డు పైకి ఈడ్చారని కన్నీటి పర్వంతో విలేకరుల ముందు వరుణ్ అతని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. సత్రంపాడు ఎంఆర్సి కాలనీలో నివాసముండే వరుణ్ స్థానిక సత్రంపాడు సెంటర్లో కార్ వాష్ గ్యారేజీ నిర్వహిస్తున్నాడు,రూపాయి రూపాయి కూడా పెట్టిన సొమ్ములతో సత్రంపాడు ఎంర్ సి కాలనీలో తన స్నేహితుడైన రాజు ఇంటిని కొనుగోలు చేసినట్లు వరుణ్ అతని భార్య విలేకరుల ముందు తెలిపారు, ఇరువురి మధ్య మనస్పర్ధలు రావటంతో తన నివాసముండే ఇంటిని నాలుగు మాసాల క్రిందట అద్దెకిచ్చినట్లు స్థానికులకు చెప్పుకుంటూ, రాజు భార్యని అతని బంధువులను నిత్యం అద్దె చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తూ గలాటా చేసేవారని ఆరోపించారు,ఇద్దరి మధ్య పెద్దల సమక్షంలో మాట్లాడి సరిచేసుకునే ముందు రోజు పక్కా ప్రణాళికతో అదే సమయంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రాజు, అతని భార్య కుటుంబ సభ్యులు,లెక్కకు మించిన అతని అనుచరులు తన ఇంటిపై మూకుమ్మడిగా ఒక్కసారిగా దండెత్తి 25 నిమిషాలలో ఇంట్లోని ఏసీ,వాషింగ్ మిషన్,గోద్రెజ్ బీరువా,పలు గృహపుకరణాలు కనురెప్పపాటులో హుటా హుటిన పెకలించేస్తుంటే తన భార్య వెంకటలక్ష్మి ప్రాధేయ పడుతున్న ,తల్లి ఆవేదనతో కన్నీటి పరమతమైన లెక్కచేయకుండా దాడి చేసి,గాయపరిచి పిల్లలను కూడా లెక్కచేయకుండా జోరున వర్షంలో నడిరోడ్డు పైకి ఈడ్చారని వాపోయారు,బీరువా పగలగొట్టి దానిలో ఇల్లు కొనుగోలు చేసిన డాక్యుమెంట్స్ భద్రపరిచిన కీలకమైన పత్రాలు,బంగారం, వెండి,నగదు చోరీ చేశారనన్నారు,విలేకరులతో రాజు,తాను, మరో వ్యక్తి ముగ్గురం స్నేహితులమని,ముగ్గురం కలిపి వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నామని తెలిపారు.కానీ ఎటువంటి వ్యాపారం చేయలేదని రాజు కుట్ర పూరితో స్వహావాన్ని ఈ విషయాన్ని తాను ఆలస్యంగా గుర్తించాననితెలిపారు,స్నేహం ముసుగులో తన ఇంటి కి ఎక్కువ ఖరీదు వస్తుందని తన భార్య అమ్మకానికి ఒప్పుకోవడం లేదని లక్షల్లో అధిక మొత్తం చెల్లించాలని లేదంటే కుదరదని అన్నట్లు తెలిపారు.అయితే రాజు గతంలో పలువురు దగ్గర లావాదేవీల విషయంలో మోసాలకు పాటుపడినట్లు వెలుగులోకి వచ్చాయని తెలిపారు,ఏ పని చేయకుండా లక్షలాది రూపాయలతో ఖరీదైన ఆస్తులను ఏ విధంగా కూడ పెట్టాడని.లగ్జరీ కార్లతో వి లాసవంతమైన జలసాలు ఎవరి డబ్బుతో చేస్తున్నాడని ప్రశ్నించారు,ఇంటిని కబ్జా చేసేందుకు కుట్రపన్నారన్న విషయంలో వాస్తవం లేదన్నారు,అతని నిజ స్వరూపం గ్రహించలేదని,వారిని పూర్తిగా నమ్మానని వాపోయారు.తీరా ఇల్లు కొనుగోలు చేసి డబ్బు చెల్లించిన తర్వాత సుమారు నాలుగు నెలల నుంచి అద్దె చెల్లించడం లేదని చెప్పుకుంటూ ఇటువంటి చర్యకు ఒడిగట్టాడని తెలిపారు,ఇంటిని తాను కొనుగోలు చేశానని ఆ సొమ్ముతోటే జల్సాలు చేశాడని ఇంటికి సంబంధించిన పత్రాలు,నగదు బంగారం,వెండి,దాడి జరిగిన సమయంలోనే మాయం చేశారని అన్నారు,తన భార్య పిల్లలను మనోవేదనకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,తనకు తమ కుటుంబానికి న్యాయం చేయాలని దంపతులు ఇరువురు కోరారు.

About Author