ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు.. మరి ధనవంతులు కావడం లేదా ?
1 min read

పల్లెవెలుగువెబ్ : బీహార్ లో బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ హిందూ దేవతలపైనా, హిందూ మత విశ్వాసాలపైనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీపావళి నాడు హిందువులు లక్ష్మీదేవిని పూజించడంపై ఆయన విమర్శనాత్మకంగా స్పందించారు. “మనం (హిందువులు) కేవలం లక్ష్మీదేవిని పూజించడం వల్లే ధనవంతులం అయితే, ముస్లింలలో బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఎవరూ ఉండరు. ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరు… మరి వారు ధనవంతులు కావడంలేదా? ముస్లింలు సరస్వతీదేవిని ఆరాధించరు… మరి వారు ఐఏఎస్, ఐపీఎస్ లు అవడంలేదా? మనం భజరంగబలి అని స్తుతిస్తే బలవంతులం అవుతామని నమ్ముతాం. ముస్లింలు, క్రిస్టియన్లు భజరంగబలి అనరు… మరి వారిలో బలవంతులు లేరా?” అని లలన్ పాశ్వాన్ ప్రశ్నించారు.

