మీ అందరి సహకారంతో శక్తివంచన లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా
1 min read
32వ డివిజన్ వై ఎస్ ఆర్ కాంగ్రస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి జక్కుల రవికుమార్ (బెనర్జీ)
ప్రచారం లో పాల్గన్న సీపీయం పార్టీ, వైసీపీ శ్రేణులు,అభిమానులు శ్రేయోభిలాషులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 32వ డివిజన్ వై ఎస్ ఆర్ కాంగ్రస్ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా జక్కుల రవికుమార్ (బెనర్జీ) బుధవారం అమ్మలోద్భవి చర్చ్ ఫాదర్ ఐ. మైకిల్ ఆశీస్సులుతో ప్రచారం కొనసాగుతున్నారు. స్థానిక డివిజన్ నుంచి మేయర్ అభ్యర్థి ఘంటా. మోహన్ రావు,జె పీ, మరియు సిపియం పార్టీ నాయకులు,వై సి పి శ్రేణులు, కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో ప్రచారం కొనసాగిస్తూ, ఒక్కసారి అవకాశం ఇచ్చే గెలిపించాలని అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై సి పి బలపరిచిన అభ్యర్థిగా మాజీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి) ప్రోత్సాహంతో 32వ డివిజన్ నుండి విజయం సాధించి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి, డివిజన్ ఓటర్లు కి బహుమతిగా ఇస్తానని, మీ అందరి సహకారంతోనే డివిజన్ ని స్వచ్ఛమైన త్రాగునీరు,డివిజన్ అంతట వీధి దీపాలు,డ్రైనేజీ సౌకర్యాలు,పక్క సిసి రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సువిశాలమైన పార్కులు మరింత మౌలిక సదుపాయాలను తీసుకురావడానికి కృషితో ,అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే ఈ విజయాన్ని సాధిస్తానని జక్కుల బెనర్జీ భీమా వ్యక్తం చేశారు.


