మహాశక్తి మీటింగ్ కు తరలిన మహిళ నేతలు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: మహానాడు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలల్లో మహిళల కోసం అమలు చేయనున్న ‘ మహాశక్తి ‘ పతాకాలపై ప్రచారం నిమిత్తం చైతన్య రథాలను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి కేంద్ర కార్యాలయం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు మహానంది మాజీ ఎంపిపి చింతం నాగమణి నేతృత్వం లో మహిళా నేతలు తరలివెళ్లారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రకటించిన ‘మహిళాశక్తి’ పథకాల్ని అర్హత ఉన్న ప్రతి మహిళకూ అందిస్తామని మాజీ ఎంపిపి నాగమణి స్పష్టం చేశారు. సీఎం జగన్ లా నిబంధనల పేరుతో కోతలు, వాతలు లేకుండా సగర్వంగా అమలు చేస్తామన్నారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం పథకాల కింద నగదు జమ, దీపం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు పథకాలపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మహాశక్తి పథకాలపై గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు అరుణ, లింగమ్మ, తెలుగు మహిళ నేత సరోజమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.