NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడలు సమాజంలో ఓ భాగం… డా. శంకర్ శర్మ

1 min read

ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. డాక్టర్. శంకర్ శర్మ…

కర్నూలు, న్యూస్​ నేడు:  ఈనెల 22న ఒలింపిక్ డే సందర్భంగా కర్నూలులో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒలంపిక్ డే సందర్భంగా హాకీ,జూడో  పోటీలు నిర్వహించారు. అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈపోటీలను డాక్టర్. శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల  మంచి ఆరోగ్యంతో పాటు కొత్తగా స్నేహితులు ఏర్పడుతారని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు.ఈసంవత్సరం ఒలంపిక్ డే స్లోగన్ లెట్ అస్ మూవ్ (ముందుకు పోదాం) అని తెలియజేశారు. ఒంటరి తనం నుంచి బయట పడాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. హాకీ క్రీడకు ధ్యాన్ చేంద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వచ్చారన్నారు. భారతదేశ జాతీయ క్రీడ అయిన హాకీ ని విద్యార్థులు ఎంచుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈకార్యక్రమంలో రామాంజనేయులు, సుధీర్, చిన్న సుంకన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author