సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలి
1 min read
బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అభివృద్ధి చెందాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ మెగా ఔట్ రీచ్
కర్నూలు, న్యూస్ నేడు: MSME (సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు) ల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని, బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మహిళలకు సూచించారు.శుక్రవారం మౌర్య ఇన్ హోటల్ పరిణయ హాల్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మెగా MSME మెగా ఔట్ రీచ్ ప్రోగ్రాం లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మహిళలు బ్యాంకు రుణాలను పొంది అభివృద్ధి పొందాలని కలెక్టర్ మహిళలకు సూచించారు. అలాగే మహిళల అభివృద్ధికి బ్యాంకులు చేయూత ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు..రాష్ట్ర ప్రభుత్వం MSME ల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..యూనియన్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ మెగా ఔట్ రీచ్ కార్యక్రమం ద్వారా యువత,మహిళలను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహించడం అభినందనీయం అని కలెక్టర్ పేర్కొన్నారు..బ్యాంకు రుణాలు పొందిన తర్వాత వాటిని తిరిగి చెల్లించడం లోనూ క్రమశిక్షణ అవసరం అని కలెక్టర్ మహిళలకు సూచించారు..మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడమే రాష్ర్ట ప్రభుత్వ ఉద్దేశ్యం అని కలెక్టర్ పేర్కొన్నారు..రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాదాపు రూ.130 కోట్ల రుణాలు, ఇతర లబ్ధికి సంబంధించి మెగా చెక్కులను మహిళలకు అందచేయనున్నామని కలెక్టర్ వివరించారు.ఈ సందర్బంగా ఎస్.హెచ్.జి. గ్రూపులకు మంజూరైన రుణాలు రూ.35 కోట్ల కు సంబంధించి మెగా చెక్కును కలెక్టర్ మహిళా సంఘ సభ్యులకు అందచేశారు.అలాగే వివిధ పథకాల కింద రుణాలకు సంబంధించి మంజూరు ఉత్తర్వులను లబ్దిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ నరసింహారావు, జనరల్ మేనేజర్ సుధాకర్ రావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అరుణ, మెప్మా పిడి నాగ శివ లీల, ఏపీఐఐసీ జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
