ఏపీలో పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ ముసాయిదా ప్రకారం నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు ఉండగా… 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం ఓటర్లలో 68,115 మంది సర్వీసు ఓటర్లు ఉండగా… 3,858 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉందన్నారు.