ఈ శ్రమ కార్డులపై కార్మికులకు అవగాహన..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా, అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు జి. కబర్థి వారి సూచనల మేరకు, శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి,కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పంచాలింగల గ్రామం నందు ఎన్ ఆర్ ఈ జి పనులు జరుగు చున్న ప్రదేశానికి వెళ్ళి అసిస్టెంట్ లేబర్ ఆఫిసర్స్ శ్రీ లక్ష్మి, రాంప్రసాద్ లు మరియు ప్యారా లీగల్ వాలంటీర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు అక్కడ పనిచేయుచున్న అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ కార్డుల గురించి వివరించారు. ఈ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలు వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు మరియు ప్రతి ఒక్క కార్మికునికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద మరణం అంగ వైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలియ జేశారు. ఈ కార్డులు పొందడానికి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వయసు కలవారు అర్హులని వారికి తెలియజేశారు.
