PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​లో  ప్రపంచ రక్తదాతల దినోత్సవం

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవంను  పురస్కరించుకొని రక్తదాతలు సమాజానికి స్ఫూర్తి దాతలు అని అన్నారు.శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని ధన్వంతరి సమావేశ మందిరంలో మానవతా రక్తదాతల సంఘం సహకారంతో  ఏర్పాటుచేసిన రక్తదాతల సమావేశంలో రక్తం యొక్క ఆవశ్యకత సర్జరీ చేసే డాక్టర్లకు అధికంగా తెలుస్తుందని 5 వేల గుండె ఆపరేషన్లు చేసిన తనకు రక్తదానం యొక్క ఆవశ్యకత ఎంత అన్నది తెలుసునని అనేక సందర్భాల్లో రక్తదాతల సహకారంతో ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.మానవత రక్తదాతల సంస్థవారు మేమెంటో మరియు శాలువతో సత్కరించినట్లు తెలియజేశారు.మానవత రక్తదాతల సంస్థ వారు వాళ్లు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు.ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని రక్తదాన చేయడం ద్వారా మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు.మానవత రక్తదాతల సంస్థ వారు రక్తదానం చేసిన వారికి మెమొంటోస్ మరియు ప్రశంసా పత్రంతో సత్కరించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూల్ డి ఎం హెచ్ ఓ, డా.ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్వో డా.భాస్కర్, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ మరియు ARMO, డా.వెంకటరమణ, కెవి సుబ్బారెడ్డి విద్య సంస్థల అధినేత, డా.కె.వి.సుబ్బారెడ్డి, కర్నూల్ 17వ వార్డ్ కార్పొరేటర్, శ్రీమతి.పద్మలత, మానవత రక్తదాతల సంస్ కన్వీనర్, శ్రీ.అమరనాథరెడ్డి, రిటైర్డ్ (పోలీసు) డిప్యూటీ సూపర్డెంట్, శ్రీ.కృష్ణమూర్తి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్, డా.శ్రీధర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author