కోడుమూరులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
1 min read
తల్లి ఆరోగ్యమే బిడ్డకి శ్రీరామరక్ష
జిల్లా సంచార చికిత్స ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రఘు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం కోడుమూరు పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా సంచార చికిత్స ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రఘు అధ్యక్షతన కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీమంతు మాదన్న ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం అయినది. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రాముఖ్యత నిస్తూ ఆరోగ్యకరమైన ప్రారంభం–ఆశాజనక మైన భవిష్యత్తు అనే పిలుపు నిచ్చిందని తెలిపారు. ప్రతి మహిళ గర్భం తో ఉన్నప్పుడూ కనీసం నాలుగు సార్లు ఆసుపత్రిలో నిపుణులతో పరీక్ష చేయించుకోవాలి,కనీసం 3 సార్లు స్కానింగ్ చేయించుకోవాలి బిడ్డకు ఏమైనా అవయ లోపాల ఉన్నాయా,బిడ్డ సరిగ్గా పెరుగుతుందా లేదా చూడాలి, 90 శాతం తల్లుల మరణాలు నివారించదగ్గవే ఉంటాయి,వారికి రక్తపోటు,శరీరం బలహీనంగా ఉండడము,బలమైన ఆహారము తీసుకోకపోవడము ప్రధాన సమస్యలుగా ఉంటాయి,అవన్నీ ముందస్తుగానే గుర్తిస్తే ఖచ్చితంగా నివారించవచ్చును,ప్రసవం కూడా శిక్షణ తీసుకున్న వైద్యులతో ఆసుపత్రిలో జరిగేలా చూసుకోవాలి, ఎoదుకంటే ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగకుండా,మాయ గర్భసంచిలోనే ఉండిపోకుండా , బిడ్డకు ఇన్ఫెక్షన్లు సోకకుండా యాంటీబయటిక్స్ ఇచ్చే వీలుoటుంది ,బిడ్డ పుట్టక 2 సంవత్సరముల వరకు కొన్ని టీకాలు,ఐదు సంవత్సరాలకి కొన్ని టీకాలు ఇవ్వవలసి ఉంటుంది,బిడ్డ పుట్టక ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలను,రెండు సమవత్సరాల వరకు తల్లిపాలతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఇవ్వవలసి ఉంటుంది, ఇవన్నీ చేస్తే కచ్చితంగా తల్లి మరియు బిడ్డల మరణాలకు నివారించేందుకు తోడ్పడుతాయని తెలివినారు. ఆ తర్వాత కోడుమూరు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి నరసప్ప హెల్త్ సూపర్వైజర్స్ కె .కమాల్ సాహెబ్, ఉమాబాయి , ప్రొజెక్టనిస్ట్ ఖలీల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.