NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బస్తిపాడు గ్రామానికి చెందిన యువత జనసేన పార్టీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయంలో 50 మంది యువకులు జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చింత సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు వారందరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల తమకు ఎంతగానో నచ్చాయని అదేవిధంగా శ్రీ చింత సురేష్ బాబు గారి నాయకత్వంలో తమ సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకంతో జాయిన్ అయ్యామని అన్నారు. చింత సురేష్ బాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లి గ్రామ స్థాయి నుండి నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతిని ప్రజలకు తెలియపరచి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తామని జూన్ నెల నుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బజారి, సుధాకర్, కృష్ణ బాబు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

About Author