PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ వాహన మిత్ర పథకం 5వ విడత రూ.12.47 కోట్లు జమ 

1 min read

జిల్లాలో 12,474 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఐదవ విడత ఆర్థిక సాయంగా రూ.12.47 కోట్లు జమ 

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలోని 12,474 ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్లకు అండగా ఉండేందుకు గాను రూ.12.47 కోట్లు రూపాయలను నేరుగా వారి ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.విజయవాడ విద్యాధరపురం నుండి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,75,931 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఖాతాలో ఐదవ విడత ఆర్థిక సహాయంగా రూ.275.93 కోట్ల రూపాయల మొత్తాన్ని బటన్‌ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తిలకించారు.శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు నుండి  ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ జి.సృజన  కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ , డిప్యూటీ రవాణా కమీషనర్ కె.శ్రీధర్, ఆర్టీఓ ఎస్.రమేష్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు యజమానులు/డ్రైవర్లు ఎవరి మీద ఆధార పడకుండా సొంతంగా ఆటో కొనుక్కొని తమకు తాము స్వయం ఉపాధిని కల్పించుకుంటూ స్వయం శక్తి మీద ఆధారపడి వారి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వీరు రోజు లక్షల మందికి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తున్నారన్నారు. వీరికి ఆసరాగా ప్రభుత్వం వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.. ఈరోజు వారి ఖాతాల్లోకి జమ చేసే నగదును కూడా కలుపుకుంటే దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి 50 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఆటో, టాక్సీ, మాక్సీ, యండియు డ్రైవర్ల వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని కారణంగా చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదనే సదుద్దేశంతో వైయస్సార్ వాహన మిత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకుగాను ఆటో, టాక్సీ, మాక్సీ, యండియు డ్రైవర్లు వారి వాహనాలకు చెందిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఇబ్బందులను గుర్తించి వారి కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, సదరు నగదును వాహన ఫిట్నెస్, నిర్వహణ భారం ఉండకూడదనే సదుద్దేశంతో ఆర్థిక సాయం మంజూరు చేయడం జరిగిందన్నారు. సదరు నగదును వాహన నిర్వహణ తదితర వాటి కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. అదే విధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం లేని పరిస్థితిలో కూడా ఆటో, టాక్సీ, మాక్సీ డ్రైవర్లకు ఏమాత్రం ఇబ్బంది కలగజేయకుండా నేరుగా వారి ఖాతాల్లోకి ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందన్నారు.వైఎస్సార్ వాహన మిత్ర పథకం క్రింద జిల్లాల్లోని ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఖాతాల్లో వరుసగా ఐదవ విడత ఆర్థిక సాయంగా జమైన నగదు వివరాలు నియోజకవర్గాల వారీగాఆదోని నియోజకవర్గానికి సంబంధించి 1564 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.56కోట్లుకోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి 820 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.82లక్షలకర్నూలు నియోజకవర్గానికి సంబంధించి 4748 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.4.74కోట్లుమంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి 980 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.98లక్షలుఆలూరు నియోజకవర్గానికి సంబంధించి 752 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.75లక్షల 20వేలుపత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి 1374 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.37కోట్లుఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబందించి 1125మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.12కోట్లు పాణ్యం నియోజకవర్గానికి సంబందించి 1111 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.11కోట్లు  జిల్లాలో 12,474 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఖాతాలో మొత్తం రూ.12.47కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి వారికి అండగా నిలిచిందిని కలెక్టర్ తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గార్ల చేతుల మీదుగా రూ.12.47 కోట్ల మెగా చెక్కును ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్లకు అందించారు.కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యనారాయణమ్మ, రవాణా శాఖ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author