NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పిటీసీ అభ్యర్థి హైమావతి విస్తృత ప్రచారం

1 min read

నాగలూటి,సుంకేసుల, కలమందలపాడులో ప్రచారం..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో శనివారం సాయంత్రం మిడుతూరు మండల టీడీపీ జడ్పిటిసి అభ్యర్థి సంపంగి హైమావతి మరియు టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఈ రెండున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ గ్రామాల అభివృద్ధి చెందాలంటే జడ్పిటిసి అభ్యర్థి హైమావతి మరియు ఎంపీటీసీ అభ్యర్థి బండారు మేరమ్మకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఉదయం సొంత గ్రామమైన నాగలూటి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు తర్వాత కలమందలపాడు గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జలకనూరు గుండం శివరామిరెడ్డి, నాగేశ్వర రెడ్డి,స్వామిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి,క్రిస్టఫర్, కాంతారెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *