PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పుల్లో అమెరికా..

1 min read

మ‌న దేశానికీ బాకీ ఉన్నారు.

రోజు రోజుకూ పెరుగుతున్న అగ్రరాజ్యం అప్పులు
ప్రపంచంలోనే సంప‌న్న దేశం ఏదంటే.. ట‌క్కున అమెరికా అని చెప్పేస్తాం. సంప‌ద‌తో పాటు టెక్నాల‌జీ, మాన‌వాభివృద్ధి, వ‌స్తు సేవ‌ల నాణ్యత‌, ఆరోగ్యం, విద్య, ర‌వాణ‌, ఆయుధ బ‌లంలో కూడ అమెరికానే ముందుంటుంది. అందుకే మ‌నం అగ్రరాజ్యం అమెరికా అంటాం. కానీ.. ఇంత‌టి గొప్పలు చెప్పుకునే అమెరికాకు కూడ అప్పులున్నాయ‌ట‌. ఇది స్వయంగా ఆ దేశ చ‌ట్టస‌భ‌ల్లో ఓ స‌భ్యుడు వెల్లడించాడు. భార‌త్, చైనా లాంటి దేశాల‌కు బాకీ ప‌డి ఉన్నట్టు ఆ స‌భ్యుడు చెప్పుకొచ్చారు. 2020 నాటికి 23.4 ట్రిలియ‌న్ డాల‌ర్ల అప్పు ఉంద‌ట‌. అమెరికా లో ఒక్కొక్కరికి అప్పు పంచితే స‌గ‌టున 72,309 డాల‌ర్ల అప్పు ఉంద‌ట‌. అంటే మ‌న రూపాయ‌ల లెక్క ప్రకారం ఒక్కొక‌రి మీద 53,44,864 రూపాయ‌ల అప్పు ఉంద‌ట‌. ఈ అప్పులు కూడ రోజు రోజుకూ పెరుగుతున్నాయ‌ట‌. ఇలాగే కొన‌సాగితే అగ్రరాజ్యం అప్పుల కుప్పలో కూర్చోక త‌ప్పద‌న్నమాట‌.

About Author