PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నీ..మావే…

1 min read
మాట్లాడుతున్న కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి

మాట్లాడుతున్న కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి

ధీమా కాదు… ప్రజలపై మాకున్న నమ్మకం
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి
– ఓటమి భయంతోనే.. నాపై దుష్ర్పచారం
– టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్
పల్లెవెలుగు, కర్నూలు బ్యూరో
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు.. మున్సిపల్​ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో కర్నూల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ , కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టి జి భరత్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, సిపిఐ నాయకుడు జగన్నాథం తో పాటు టిడిపి నాయకులు ,పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు . ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ నాయకులు ఆవిష్కరించారు . ఆ తరువాత మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది కోట్ల, కేయి, టీజీ కుటుంబాల వల్లనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి చేసిన వారిని గుర్తించి ఆదరించాలని ఆయన కోరారు. కర్నూల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేశామని, అలాగే కర్నూలు తాగునీటిని సమస్యను పరిష్కరించేందుకు గుండ్రేవుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 52 వార్డులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవాలని, ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో మొత్తం 52 వార్డులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో ఓడిపోతామనే తెలుసుకుని ప్రత్యర్ధులు యువనేత టీజీ పార్టీ మారుతారని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.దీనిని అందరూ ఖండించాలని కోరారు. కర్నూల్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ టిజి భరత్ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని, మున్సిపల్​ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ విజయకేతనం ఎగరేయాలన్నారు. అనంతరం పాణ్యం అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజల మద్దతును కూడగట్టాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. అనంతరం సిపిఐ నాయకుడు జగన్నాథం మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో రాబట్టుకోవాలని కోరారు .

About Author