NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కార్మికులను నయా బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పరిరక్షించాలని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీ కరణ ఆపాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,మండల కార్యదర్శి ఎ.వి.భాస్కర్ రెడ్డి,రైతు సంఘం మండల అధ్యక్షులు బి.నాగమద్దయ్య సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్.ఎ.చిన్న రెహమాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బేతంచెర్ల సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాటాల ద్వారా ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు సివిల్ కోడ్ లుగా మార్చుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం దుర్మార్గం అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినారాయణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,చంద్ర,లక్ష్మన్న,మద్దయ్య,అన్వేష్, నాగేశ్వరరావు,బాలు,బాబు,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author