టీడీపీ ప్రభుత్వం వస్తే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం… టిజి భరత్
1 min read
కర్నూలు జిల్లా పల్లె వెలుగు: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కర్నూల్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 44వ వార్డులో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమంతో పాటు ఒక్కరోజు అన్న క్యాంటీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ టిడిపి అబిమానులందరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. టిడిపి అధికారంలో ఉండి ఉంటే అన్న క్యాంటీన్ కొనసాగేదన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం అన్న క్యాంటీన్ ను ఈ ప్రభుత్వం కొనసాగించకపోవడం బాధాకరమని అన్నారు. అందుకే ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. టిడిపి అధికారంలో ఉంటే దేశంలోనే మనరాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉండదన్నారు. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించి కర్నూల్ ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. కర్నూలులో భరత్ ను ఎమ్మెల్యే చేసుకుందామని చెప్పారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు. కర్నూలో భరత్ భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. అనంతరం స్థానిక ప్రజలకు అన్న క్యాంటీన్ ద్వారా ఉచితంగా అన్నం పెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి మనోజ్, నగర అధ్యక్షుడు గున్న మార్క్, నేతలు దాసెట్టి శ్రీనివాసులు, పాల్ రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.