NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికలు ఉన్నత చదువులు చదవాలి

1 min read

మంత్రాలయం న్యూస్​ నేడు :  బాలికలు ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తీసుకురావాలని సిడిపిఓ నరసమ్మ పేర్కొన్నారు. మంగళవారం మంత్రాలయం లోని రాఘవేంద్ర నగర్ లో ఉన్న 4 వ అంగన్వాడి కేంద్రం లో  కిషోర్ వికాస్ వేసవి సెలవుల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ కె నరసమ్మ మాట్లాడుతూ  మే రెండవ తేదీ నుంచి జూన్ 10 వరకు  అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాలికల ఉన్నత విద్య నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. వారి భవిష్యత్తు  మార్గదర్శకాలు పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రత పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి వీర గోవిందమ్మ, పి హెచ్ సి జ్యోతి, మహిళా పోలీస్ శాంతి, అంగన్వాడి టీచర్ బి.వి.శ్వేత,ఆశా సుజాత, కే లలిత  మరియు ఆయాలు, కిషోర్ బాలికలు, వి వి కే మహిళా సంఘం లీడర్స్ పాల్గొన్నారు.

About Author