ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు
1 min read

పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్న గొప్ప నాయకుడు నారా లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం
కడప మహానాడులో పేర్కొన్న మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: సీఎం చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఉండటం మన అదృష్టమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే ఒక పెద్ద బ్రాండ్. దేశ విదేశాల్లో ఆయన గురించి ఎంతో మంది గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం ఏపీ ప్రజలకు గొప్ప వరం. ఇక మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు అన్నారు.. కానీ పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా ఆయన పాదయాత్ర చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎంతో నేర్చుకున్నారు. వారి కష్టాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. నేడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్య్రం వచ్చిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రానున్న నాలుగేళ్లలో భారీగా పెట్టుబడులు తీసుకొస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి అన్నివిధాలా ప్రోత్సహించి త్వరగా అనుమతులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నికల్లో మాటిచ్చిన విధంగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు.


