నీతి నిజాయితీకి మారుపేరు.. దామోదరం సంజీవయ్య
1 min readకాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ యాదవ్
పల్లెవెలుగు, కల్లూరు అర్బన్
నీతినిజాయితీకి… నిస్వార్థానికి నిదర్శనం… దివంగత నేత, ఏపీ మొదటి సీఎం దామోదరం సంజీవయ్య అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఆదివారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ దళిత జనబాంధవుడు దామోదరం సంజీవయ్య కార్మికులకు, శ్రామికులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి అని, వృద్ధులను ఆదుకోవడం కోసం వృద్ధాప్య పింఛను అమలు చేసిన ఘనత దామోదరం సంజీవయ్యదేనన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులైనా గాజులదిన్నే, వరదరాజుల పులిచింతల, వంశధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన నాటి నిర్మాణానికి దోహదం చేసిన సంజీవయ్య.. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు లంచాలు ఇవ్వకుండా దేశంలోనే మొట్టమొదటిసారి ఏసిబిని స్థాపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్ అబీబ్ఖాన్ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు బోయ నాగరాజు ఓర్వకల్లు మండల అధ్యక్షులు వెంకటనాయుడు యువజన కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్ రవి రమణ పాల్గొన్నారు.