PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫేక్ ఉద్యోగాల తీగ లాగితే.. రూ.20 కోట్ల డొంక క‌దిలింది

1 min read

చిత్తూరు; అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఫ‌లానా విభాగంలో మీ ఉద్యోగం అని చెప్తారు. ఆ ఉద్యోగానికి కావ‌ల‌సిన శిక్షణ కూడ ఇస్తారు. ఉద్యోగం ఇచ్చినందుకు ప్రతిఫ‌లంగా డబ్బులు వ‌సూలు చేస్తారు. తీరా.. ఆ ఫ‌లాన విభాగంలోకి వెళ్లి త‌మ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే.. అది ఫేక్ లెట‌ర్ అని తేలితే.. ఆశ్చర్యం, మోస‌పోయామ‌నే బాధ త‌ప్ప మిగిలిందేమి లేదు ఆ ఆశావ‌హ అభ్యర్థుల‌కు. ఇది సినిమాలో క‌థ కాదు. త‌మిళానాడులో ఓ గ్యాంగ్ న‌డుపుతున్న దందా. అలాంటి ముఠాని చిత్తూరు పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. ఉద్యోగార్థుల‌కు వ‌ల వేసి… దాదాపు రూ.20 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్లడైంది. దీంతో ఖంగుతిన్న పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు. త‌మిళ‌నాడు విల్లు పురానికి చెందిన దేవ‌ప్రియ‌న్, హ‌రిహ‌ర కుమార్ ఈ ఉంద‌తానికి తెర‌లేపారు. ఓ కేంద్ర మంత్రి కార్యాలయంలోని కొంద‌రితో ప‌రిచ‌యం పెంచుకుని రైల్వే విభాగంలో ఉద్యాగాలు ఇప్పిస్తాన‌ని న‌మ్మబ‌లికి.. ఒక్కో అభ్యర్థి నుంచి 20 ల‌క్షల నుంచి 30 ల‌క్షల వ‌ర‌కు వ‌సూలు చేశారు. వ‌సూలు చేసిన డ‌బ్బుతో ఆస్తులు కూడ దేవ ప్రియ‌న్ కొన్నాడు. అయితే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కూడ 26 ల‌క్షలు రైల్వే ఉద్యోగం కోసం దేవ ప్రియ‌న్ కు ఇచ్చాడు. అయితే.. తాను మోస‌పోయానని గ్రహించిన స‌ద‌రు నిరుద్యోగి పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు తీగ లాగితే .. డొంక మొత్తం క‌దిలింది.

About Author