PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సి‘పోల్స్​’లో ఆర్​ఓల పాత్ర కీలకం..

1 min read
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్​ డీకే బాలాజి

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్​ డీకే బాలాజి

ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి
– పోలింగ్ కేంద్రాలకు కౌంటింగ్ మెటీరియల్ జాగ్రత్తగా పంపాలి
– మున్సిపల్ కమిషనర్ డి. కె. బాలాజీ
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు నగక పాలక సంస్థ పరిధిలో ఎన్నికలను పగడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు నగరపాలక సంస్థ సమావేశ భవనంలో మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ లు, ఏ ఆర్ ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డీకే. బాలాజీ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు అందరూ మునిసిపల్ ఎన్నికలను పగడ్బందీగా, నిష్పక్షపాతంగా, విజయవంతంగా నిర్వహించడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ ఎన్నికలలో విత్ డ్రాల్స్ చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. ఎన్నికల ఎక్స్పెండిచర్ కు సంబంధించి ప్రత్యేక రిజిస్టరు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభ్యర్థుల విత్ డాల్స్, ఎన్నికల ఎక్స్పెండిచర్, నామినేషన్ల ఫాన్స్ నింపే విధానం, పోస్టల్ బ్యాలెట్లు, కౌంటింగ్ నిర్వహించే విధానం, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, వంటి సూచనలు సలహాలను ఆర్ వో లు ఏ ఆర్ వో లకు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వ ర్, అర్ ఓ లు, ఏ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్​ ఎన్నికల సరళి ఇలా..
– మార్చి 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ
– 3న విత్​ డ్రా.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫైనల్​ అభ్యర్థులను ప్రకటించాలి.
– 10న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్,
– అవసరమైన చోట.. 13న 7.00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్,
– 14 వ తేదీన ఓట్ల లెక్కింపు.. … అదే రోజు విజేతల ప్రకటింపు

About Author