NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేనేజ్​మెంట్​.. ప్రణాళిక.. అద్భుతం..

1 min read
కాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న ఎస్​.ఈ.సీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​

కాన్ఫరెన్స్​లో మాట్లాడుతున్న ఎస్​.ఈ.సీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​

జీ.పీ.ఎన్నికలు విజయవంతం.. అభినందనీయం
–కలెక్టర్​, ఎస్పీకి కితాబు ఇచ్చిన ఎస్​.ఈ.సీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్

పల్లెవెలుగు,కర్నూలుబ్యూరో
గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా విజయవంతం చేయడంలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప కృషి అభినందనీయమని ఎస్​.ఈ.సీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఎన్నికలను ప్రణాళికబద్ధంగా నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని మేనేజ్​ చేయడం, నాల్గవ విడత ఓట్ల లెక్కింపును రాత్రి 9 గంటలకే పూర్తి చేయడం ప్రశంసనీయమన్నారు. శనివారం తిరుపతి ఎస్.వీ.యూ.సెనేట్ హాల్లో మున్సిపల్ ఎన్నికలపై రాయలసీమ జిల్లాల కలెక్టర్లు, డి.ఐ.జి. లు, ఎస్పీ లు, మునిసిపల్ కమీషనర్ లతో రీజినల్ కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఈ.సి. మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన స్పూర్తితో కలెక్టర్లు, ఎస్పీ లు, మునిసిపల్ కమీషనర్లు మునిసిపల్ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించాలని ఎస్.ఈ.సి ఆదేశించారు. ఎలెక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోడల్ కోడ్ నిబంధనలనే జిల్లాలలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం కలెక్టర్​ జి. వీరపాండియన్​ , ఎస్పీ ఫక్కీరప్ప.. కర్నూలు జిల్లాలో చేపట్టిన మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లను పీపీటీ ప్రెజెంటేషన్​ ద్వారా ఎస్​.ఈ.సీకి వివరించారు. కాన్పరెన్స్​లో డి.ఐ.జి. వెంకట్రామి రెడ్డి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, కర్నూలు నగరపాలక సంస్థ కమీషనర్ డీకే బాలాజీ, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు. అదేవిధంగా కర్నూలు కాన్ఫరెన్స్​ హాల్​ నుంచి జేసీ (రెవెన్యూ) ఎస్​. రాం సుందర్​ రెడ్డి, డీఆర్​ఓ పుల్లయ్య, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, జిల్లా నోడల్ కమిటీల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

About Author