NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్ఫూర్తిదాయకుడు.. దామోదరం సంజీవయ్య

1 min read
సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

– నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​
పల్లెవెలుగు, కర్నూలు టౌన్​
దివంగత నేత, ఉమ్మడి ఏపీ మొట్టమొదటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య… యువతకు ఆదర్శనీయమని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ అన్నారు. దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతే పిన్న వయస్సులోనే సీఎం పదవిని అలంకరించిన దామోదరం సంజీవయ్య..సిద్ధాంతాలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు.
వెనుకబడిన కర్నూలు జిల్లాలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అప్పట్లోనే చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విశాఖ లో ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే…
పారిశ్రామిక అభివృద్ధి కార్మికులపై ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వరంగ స్థలాలలో తెలుగు భాష వాడుకను అధికం చేసిన ఘనత ఆయన చలువేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు 15వ వార్డు ఇన్చార్జి కేదార్నాథ్, నాయకులు ప్రసాద్, సంతోష్ కిరణ్, గఫూర్, కృష్ణ కాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

About Author